- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నేనేంటో చూపిస్తా.. అక్కడ కేటీఆర్‌ను అడుగు కూడా పెట్టనివ్వను’: గువ్వల బాలరాజు హెచ్చరిక
by Gantepaka Srikanth |
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం ఆయన ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం ఆయన ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. ‘కేటీఆర్(KTR) నాకంటే పెద్దోడేమీ కాదు. ఆయన విదేశాల్లో చదువుకున్నాడేమో కానీ నాకున్న అనుభవం కేటీఆర్‌కు లేదు. రాబోయే రోజుల్లో నేనేంటో కేటీఆర్‌కు చూపిస్తా. గ్రామాల్లో కూడా అడుగుపెట్టనివ్వను’ అని గువ్వల బాలరాజు హాట్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే.. నేడు గువ్వల బాలరాజు బీజేపీలో చేరబోతున్నారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారు. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. తనతో ఎవరూ రావట్లేదని.. తాను ఒక్కడినే పార్టీలో చేరుతున్నానని ఇప్పటికే గువ్వల బాలరాజు ప్రకటించారు.
Next Story






