Guvvala Balaraju: బీజేపీ సిద్ధాంతం, లక్ష్యాలు నాకు నచ్చుతున్నాయి

by Gantepaka Srikanth |

బీజేపీ(BJP)లో చేరికపై అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) అధికారిక ప్రకటన చేశారు.

Guvvala Balaraju: బీజేపీ సిద్ధాంతం, లక్ష్యాలు నాకు నచ్చుతున్నాయి
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ(BJP)లో చేరికపై అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) అధికారిక ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈనెల 10వ తేదీన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీలో చేరబోతున్నాను. రాంచందర్ రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నాను. బీజేపీ సిద్ధాంతం, లక్ష్యాలు నాకు నచ్చే ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాను. నాకు వ్యతిరేకంగా అచ్చంపేటలో ఎవరెన్ని సభలు, సమావేశాలు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు. నన్ను ఇక ఎవరూ ఏమీ చేయలేరు. నేను ఒక్కడినే బీజేపీలో చేరుతున్నాను.. నాతో పాటు ఎవరూ చేరడం లేదు’ అని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు.

కాగా, అంతకుముందు కూడా గువ్వల బాలరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను చంపుతామన్న బెదిరింపులపై కేసీఆర్‌ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని గువ్వల బాలరాజు ఆవేదన చెందారు. కాంగ్రెస్‌ నుంచి చేరిన రాజయ్య, కడియం శ్రీహరికి మంత్రి పదువులు ఇచ్చారని అన్నారు.

Next Story