- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నా ఓటమికి కారణం ఆ ఇన్సిడెంటే’.. కుండబద్దలు కొట్టిన గువ్వల బాలరాజు
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అచ్చంపేట ప్రజలు నన్ను రెండుసార్లు ఆశీర్వదించారు. బీఆర్ఎస్‌లో నా ఆశయాలకు అనుకున్న స్థాయిలో గౌరవం దక్కలేదు. కేసీఆర్ అధికారం కోల్పోయాక ఇంటినుంచే ఆదేశాలిచ్చారు. ప్రభుత్వాన్ని కేసీఆర్(KCR) సరిగ్గా ప్రశ్నించడం లేదు. సమస్యలపై బీఆర్ఎస్ అగ్రనేతలు పోరాటం చేయట్లేదు. ప్రజలే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లాలని ఎన్నోసార్లు చెప్పా. కవిత వ్యవహారంతో అందరూ గందరగోళానికి గురవుతున్నారు. కేసీఆర్ చెప్పిందే ఇన్నాళ్లు తూచా తప్పకుండా పాటించా.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతోనే అవకాశాలు వచ్చాయి.. ఏ పార్టీ నన్ను కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదు.. ఏ పార్టీలో చేరుతాననే విషయం ఇప్పటికీ ప్రకటించలేదు.. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి.. ఫామ్‌హౌస్ ఎపిసోడ్ కూడా ఓటమికి ఓ కారణం.. ప్రస్తుతానికి నా పొలిటికల్ కెరీర్‌కు ఎలాంటి ప్రమాదం లేదు’ అని గువ్వల బాలరాజు అన్నారు.






