- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: సీఎం రేవంత్ CPROగా గుర్రం మల్సూర్
తెలంగాణలో పాలనను పరుగులుపెట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికార యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి సీపీఆర్వో (చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్)గా గుర్రం మల్సూర్‌ను నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్ట్ బేసిస్‌లో మల్సూర్‌ను నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మల్సూర్‌ను ఇండస్ట్రియల్ కమిషనర్‌గా నియమించింది. మే 31 వరకు ఇండస్ట్రియల్ కమిషనర్‌గా పనిచేసిన ఆయన ఆ తరువాత రిటైర్‌మెంట్ అయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మినరల్ డెవలప్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. గ్రూప్ 1 కేడర్‌కు చెందిన ఆయన ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో సీపీఆర్వోగా నియమితులయ్యారు. కాగా.. ఇప్పటివరకు సీపీఆర్వోగా కొనసాగిన అయోధ్యరెడ్డిని సమాచార శాఖ కమిషనర్‌గా బదిలీ చేసిన విషయం తెలిసిందే..
Next Story






