- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gulzar House Fire Accident : గుల్జార్ హౌస్ ఘటన... విద్యుత్ చౌర్యమే ఏసీ పేలుడుకు కారణం
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్(Hyderabad)లోని గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం(Gulzar House Fire Accident) గురించి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్(Hyderabad)లోని గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం(Gulzar House Fire Accident) గురించి తెలిసిందే. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా.. వారిలో అత్యధికంగా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం అత్యంత విషాదం. ఈ ఘటనను HRC సుమోటోగా స్వీకరించి.. తెలంగాణ సీఎస్, నగర సీపీ, ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏసీ పేలుడుగా గుర్తించిన అధికారులు.. విచారణలో మరిన్ని నిజాలను వెలికి తీశారు. ఏసీ పేలుడుకు విద్యుత్ చౌర్యమే ముఖ్య కారణమని తేల్చారు. ప్రమాదం జరిగిన భవనం కింద ఉన్న నగల షాప్ మూసివేసిన అనంతరం దానికి విద్యుత్ ను అందించే హైటెన్షన్ తీగల నుంచి స్థానికులు కరెంట్ చోరీ చేస్తున్నట్టుగా గుర్తించారు.
ఈ విద్యుత్ లోడ్ అంతా భవనంలోని మీటర్లపై పడి, అవి పేలి మంటలు అంటుకున్నాయని తెలిపారు. మంటలు క్రమంగా ఏసీ కంప్రెషర్ ము తాకడంతో ఒక్కసారిగా అది పేలి పోయి మంటలు వేగంగా భవనం మొత్తం వ్యాపించాయని అధికారులు పేర్కొన్నారు. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో బయటకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నం విఫలం అయిందని తెలిపారు. మెట్ల మార్గంలో మంటలు భారీగా ఎగిసిపడటంతో వారంతా లోపలే ఉండిపోగా ఫైర్ సిబ్బంది వచ్చే సరికే అపస్మారస్థితిలోకి వెళ్లినట్లు వెల్లడించారు.






