- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సికింద్రాబాద్’ చుట్టూ ‘గ్రేటర్’ పాలిటిక్స్
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కో సం గ్రేటర్ రాజకీయాలు తిరుగుతున్నా యి. కొత్త కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ ఆం దోళనల బాట పట్టగా, బీజేపీ తాము సైతం అంటోంది.

దిశ, హైదరాబాద్ బ్యూరో: సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కో సం గ్రేటర్ రాజకీయాలు తిరుగుతున్నా యి. కొత్త కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ ఆం దోళనల బాట పట్టగా, బీజేపీ తాము సైతం అంటోంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలపై ఎదురుదాడి ప్రారంభించిం ది. అధికారంలో ఉన్న సమయంలో నోరు మెదపని బీఆర్ఎస్ నాయకులు, మాజీ మం త్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు ఆం దోళనల పేరిట రోడ్ల మీదకు రావడాన్ని ప్ర శ్నిస్తోంది. కొత్త కార్పొరేషన్ల విషయంలో సి కింద్రాబాద్ అస్తిత్వానికి ఎలాంటి భంగల వాటిల్లదని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంట ర్ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ అధికారం లో ఉన్న సమయంలో కొత్త జిల్లాలు ఏర్పా టు చేసి సికింద్రాబాద్‌ను ఎందుకు మరిచారని ఆయన ప్రశ్నించారు. నాడు నోరు మెద పని తలసాని నేడు ఆందోళనలకు దిగడం పడిపోతున్న తన గ్రాఫ్‌ను నిలబెట్టుకోవడాని కేననే టాక్ వినిపిస్తోంది. సికింద్రాబా ద్‌ను ముక్కలుగా చేసి మల్కాజ్‌గిరి కార్పొరేషన్ లో కలిపితే సహించబోమని ఆయన అనడం రాజకీయ లబ్ధి కోసమేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరో 20 రోజులే
జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకవర్గం గడువు వచ్చే నెల 10వ తేదీతో ముగియనుంది. స్థా నిక సంస్థల ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో పట్టుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాత్మకం గా పావులు కదుపుతున్నాయి. రెండేళ్ల క్రి తం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు దక్కించుకోని అధికార కాంగ్రెస్ అనంతరం జరిగిన కం టోన్మెంట్, జూబ్లీహిల్స్ బై పోల్స్‌లో విజయఢంకా మోగించింది. త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా చూపే అవకాశాలు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ ఉనికిని చాటు కోవడం కోసమే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులో ని మహాత్మాగాంధీ విగ్రహం వరకు సికింద్రాబాద్ సాధన పేరుతో ర్యాలీ బాట పట్టిం దనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ?
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొనడం, ఇందుకోసం జరుగుతున్న ఆందోళనలకు మద్దతిస్తామని ప్రకటించడం బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు సైతం మొదలయ్యాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నిలువరించాలంటే విభేదాలు వీడి కలిసి పని చేయడం ఒక్కటే మార్గమనే అభిప్రాయంలో రెండు పార్టీలూ ఉన్నాయనే గుసగుసలు వినబడుతున్నాయి. ఇందుకోసమే సికింద్రాబాద్ కార్పొరేషన్ అంశాన్ని బీఆర్ఎస్, బీజేపీలు తెరముందుకు తెచ్చాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పికొడుతున్నారు. మొత్తం మీద సికింద్రాబాద్ కొత్త కార్పొరేషన్ ఏర్పాటు అంశం జీహెచ్ఎంసీ రాజకీయాలను కుదిపేస్తోంది.






