- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్ జెండర్లకు అదిరిపోయే శుభవార్త !
తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లకు అదిరిపోయే శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా కీలక ప్రకట

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లకు అదిరిపోయే శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. ట్రాన్స్ జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. నిర్లక్ష్యానికి గురవుతున్న సీనియర్ సిటిజన్స్ సంక్షేమార్థం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల జీతం లో నుంచి 10 శాతం నుంచి 15% డబ్బును నేరుగా వారి పేరెంట్స్ బ్యాంకు ఖాతాలో జమ చేసే అంశాన్ని... పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇక దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్ లకు ఉపాధి అవకాశాలు పెంచాలని సూచనలు చేశారు. రవాణా, ఐటీ సెక్టర్, ప్రైవేట్ కంపెనీ అలాగే హెల్త్, ఎండోమెంట్స్ లలో ట్రాన్స్ జెండర్ లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రేవంత్ రెడ్డి ఆదేశాలను అధికారులు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.






