ఇన్ సర్వీస్ టీచర్లకు TET నుంచి మినహాయింనివ్వండి: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు వినతి

by Kema Shiva Kumar |

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సర్వీస్‌లో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింనివ్వాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇన్ సర్వీస్ టీచర్లకు TET నుంచి మినహాయింనివ్వండి: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సర్వీస్‌లో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింనివ్వాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల సుప్రీం కోర్టు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టెట్ నిబంధనలను తప్పనిసరి చేస్తూ తీర్పు నివ్వడంతో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామెదర్ రెడ్డి, సుంకరి భిక్షం‌గౌడ్‌తో పాటు పార్లమెంటు ఆవరణలోని విద్యా మంత్రి కార్యాలయంలో ధర్మేంద్ర ప్రదాన్‌‌ను కలిసి ప్రాతినిథ్యం చేశారు. దీనికి స్పందించిన మంత్రి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రెండు వేర్వేరు తీర్పులలో టెట్ నిబంధనను తప్పనిసరి చేయడంతో సమస్య ఏర్పడిందని, ఈ సమస్యను అధిగమించడానికి న్యాయపరమైన సలహా తీసుకుని ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో పీఆర్టీయూటీఎస్ నాయకులు సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల సతీష్‌రెడ్డి ఉన్నారు.

Next Story