Central Govt: కేంద్రంపై పెండింగ్‌ లో 7 లక్షల కేసులు

by Prasad Jukanti |   ( Updated:2025-02-06 11:44:26.0  )
Central Govt: కేంద్రంపై  పెండింగ్‌ లో 7 లక్షల కేసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కోర్టుల్లో పెండింగ్ లో (Cases Pending in Courts) ఉన్న దాదాపు ఏడు లక్షల కేసుల్లో కేంద్ర ప్రభుత్వం (Central Government) కక్షిదారుగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గురువారం రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ (Arjun Ram Meghwal) ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ విషయం వెల్లడించారు. ఇందులో ఒక్క ఆర్థిక శాఖే దాదాపు రెండు లక్షల కేసుల్లో కక్షిదారుగా ఉన్నట్లు వెల్లడించారు. క్రిమినల్ లా (సవరణ) చట్టం 2018 అమలులోకి రావడం, సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల (ఎఫ్‌టిఎస్‌సి) ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.

Next Story