Telangana Governor: సంక్షేమానికి, సంస్కృతికి ప్రజాప్రభుత్వం పెద్దపీట

by Gantepaka Srikanth |

తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం(Congress Govt)పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) ప్రశంసల వర్షం కురిపించారు.

Telangana Governor: సంక్షేమానికి, సంస్కృతికి ప్రజాప్రభుత్వం పెద్దపీట
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం(Congress Govt)పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) ప్రశంసల వర్షం కురిపించారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌(Parade Ground)లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కీలక ప్రసంగం చేశారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమానికి, సంస్కృతికి పెద్దపీట వేస్తోందని అన్నారు. అందెశ్రీ రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నముకగా మార్చినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 25 లక్షల మందికిపైగా రైతుల రుణాలు మాఫీ చేసినట్లు తెలిపారు.

ప్రజా ప్రభుత్వం రైతులకు రైతుభరోసా అందిస్తోందని అన్నారు. వ్యవసాయకూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. సన్నరకం బియ్యానికి బోనస్ అందించామని వెల్లడించారు. 2024 వర్షా కాలంలో 1.59 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఉచితబస్సు రవాణాతో మహిళలకు రూ.4,500 కోట్లు ఆదా అయిందని అన్నారు. 50 లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి అందిస్తున్నట్లు చెప్పారు. యువత సాధికారత కోసం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

Next Story