Kavitha : కులగణన రెండో దఫాపై ప్రభుత్వం నిర్లక్ష్యం : కవిత

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-28 09:47:39  IST  )

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy Government) ఏ చిన్న పనిచేసిన మొదటి పేజిల్లో పబ్లిసిటీ చేసుకుంటుందని..కాని రెండో దఫా కులగణన(Second Phase Of Caste Census)పై సరైన ప్రచారం కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తొలిదశలో మిగిలిపోయిన కుటుంబాలు మరోసారి సర్వేను సద్వినియోగం చేసుకోలేకపోయాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)ఆరోపించారు.

Kavitha : కులగణన రెండో దఫాపై ప్రభుత్వం నిర్లక్ష్యం : కవిత
X

దిశ, డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy Government) ఏ చిన్న పనిచేసిన మొదటి పేజిల్లో పబ్లిసిటీ చేసుకుంటుందని..కాని రెండో దఫా కులగణన(Second Phase Of Caste Census)పై సరైన ప్రచారం కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తొలిదశలో మిగిలిపోయిన కుటుంబాలు మరోసారి సర్వేను సద్వినియోగం చేసుకోలేకపోయాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)ఆరోపించారు.

నాగర్ కర్నూల్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్(BC Caste Associations Round Table) సమావేశానికి హాజరై మాట్లాడారు. రెండో దఫా కులగణనలో ఆన్ లైన్ లో నమోదుచేసుకున్న 10వేల కుటుంబాల లెక్కలనే ప్రభుత్వం చెప్పి బీసీల సంఖ్యను తక్కువ చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి మనల్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒకటే బిల్లు పెట్టాలని చూస్తోందన్నారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేరకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలన్నింటికి కలిపి 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు పెడుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చెప్పారని అయితే ఒకటే బిల్లు పెడితే బీసీలకు న్యాయం జరుగదని..అదిగాక న్యాయపరంగా నిలబడబోదన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మూడు బిల్లులు పెట్టాలని మేం డిమాండ్ చేస్తున్నామన్నారు.

ప్రభుత్వం చెప్పిన బీసీల లెక్కలు కాకిలెక్కలైనప్పటికి 46శాతం రిజర్వేషన్ల చొప్పున మూడు బిల్లులు విద్య, ఉద్యోగ, రాజకీయాలలో వేర్వేరుగా పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. మూడు బిల్లులు పెడితేనే బీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టబద్ధంగా నిలబడటంతో పాటు బీసీలకు ఆయా రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు.

Next Story