- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్
తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు మరో బంపర్ అఫర్ ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు మరో బంపర్ అఫర్ ప్రకటించింది. ట్రాన్స్‌జెండర్ సమాజానికి ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు ప్రభుత్వ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ విధుల్లో నియమించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గత ఎనిమిది నెలలుగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విజయవంతంగా సేవలందిస్తున్న ట్రాన్స్‌జెండర్లను ఇప్పుడు జీహెచ్‌ఎంసీ(GHMC), ఆర్టీసీ (RTC), హెచ్‌ఎండీఏ (HMDA)లలో సెక్యూరిటీ విధుల్లో నియమించాలని నిర్ణయం తీసుకుంది.
అలాగే దశలవారీగా ఐటీ కంపెనీల్లో సెక్యూరిటీ విధుల్లోకి తీసుకునేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ట్రాన్స్‌జెండర్ల నైపుణ్యాలు, విద్యార్హతల ఆధారంగా శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 25, ఆర్టీసీలో 20 ఉద్యోగాలను ట్రాన్స్‌జెండర్ల కోసం గుర్తించారు. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత ఈ పథకం వెంటనే అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
ట్రాన్స్‌జెండర్లకు ఆర్థిక స్థిరత్వం కల్పించడంతో పాటు సమాజంలో గౌరవప్రదమైన ఉపాధిని అందించడమే ప్రభుత్వం లక్ష్యం అని అధికారులు పేర్కొన్నారు. కాగా ట్రాన్స్‌జెండర్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఆ చర్యలపై LGBTQ కమ్యూనిటీకి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






