- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీ బతుక్కి నీ చెల్లె అడిగిన ప్రశ్నకైనా జవాబు లేదు.. కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ ఘాటు విమర్శలు
కేటీఆర్.. నువ్వెన్ని పెడబొబ్బలు పెట్టినా ఏం ఉపయోగం లేదు.. అంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేటీఆర్.. నువ్వెన్ని పెడబొబ్బలు పెట్టినా ఏం ఉపయోగం లేదు.. అంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మా ముఖ్యమంత్రి పైన పిచ్చి పిచ్చి గా వాగినంత మాత్రం నువ్వు పెద్ద మొగోడివి కావు అని మండిపడ్డారు. నీ బతుకు, నీ అయ్య బతుకు ఏమిటో ఇప్పటికే తెలంగాణ ప్రజలు తేల్చారని విమర్శించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు సువర్టుపురం దొంగల్లా తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. (Pragati Bhavan) ప్రగతిభవన్ గడీ కట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తు పాలన చేశారని విరుచుకపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కరివేపాకు అంటే హీనంగా చూసిన బతకులు మీవి, మా ముఖ్యమంత్రి అందరు మంత్రులు, ప్రజా ప్రతినిధులను గౌరవిస్తున్నారని అన్నారు.
‘మీలాగా గేటు దగ్గర అవమానించి పంపడం లేదు, వేదికల పైన మంత్రులను ఈసడించుకోలేదు, ఈక ముక్కలా తీసిపారేయలేదు, కారణం చెప్పకుండా దళిత డిప్యూటీ సీఎం ని బర్తరఫ్ చేసి పైశాచిక ఆనందం మా సీఎం పొందలేదు’ అని ప్రభుత్వ విప్ విమర్శలు గుప్పించారు. అవినీతి సొమ్ములో వాటా అడిగిన సొంత బిడ్డను పార్టీ నుంచి గెంటివేసిన చరిత్ర మీది అని విమర్శించారు. పదేళ్ల అధికారంలో అనేక మంది నిజాయితీ పరులైన ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు ఫోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కన పెట్టింది మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. రిటైర్డ్ అధికారులతో రాజ్యం నడిపిన విషయాలు గుర్తు లేదా..? అని నిలదీశారు.
తెలంగాణ పోలీసులు ఏం పీకుతున్నారని వాగుతున్నావు.. ఏప్పుడు పీకాలో అప్పుడు పీకుతారు.. వెయిట్ చేయి.. అంటూ ప్రభుత్వ విప్ ఫైర్ అయ్యారు. సొంత ఇళ్లు చక్కబెట్టుకోలేని నువ్వు కూడా మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతవా..? అని ప్రశ్నించారు. నీ బతుక్కి నీ చెల్లె అడిగిన ఒక్క ప్రశ్నకైనా ఇప్పటి వరకు సమాధానం చెప్పావా? అని ఘాటు విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం నువ్వు చేస్తున్న డ్రామాలు ఆపు.. నువ్వెంత ఎగిరిపెడ్డా ఉపయోగం లేదు.. నీ మూతి పళ్లే రాలుతాయి చూసుకో.. అంటూ ప్రభుత్వ పిప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్(KTR)పై ఆగ్రహం వ్యక్తం చేశారు.






