బూతు పురాణాన్ని పరిచయం చేసింది మీరు కాదా.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

by Ramesh Naini |

పదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బూతు పురాణాన్ని పరిచయం చేసింది మీరు కాదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు.

బూతు పురాణాన్ని పరిచయం చేసింది మీరు కాదా.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బూతు పురాణాన్ని పరిచయం చేసింది మీరు కాదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని అంత మాట అనడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. సీఎల్పీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించాలని చూస్తున్నావా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు.అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలు తగిన శాస్త్రి చేస్తారని అన్నారు. తోలు తీస్తా అని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం వల్లనే మా సీఎం రియాక్ట్ అయ్యారని అన్నారు.

ఆంధ్రా వాళ్ళ పైన మా ముఖ్యమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కోన్నారు. నువ్వ గుంటూరులో చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేశావు. .తెలంగాణ గురించి నీకు ఏం తెలుసు అని మాత్రమే సీఎం అన్నారని వెల్లడించారు. జగన్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని విందులు ఇచ్చింది మీరు కాదా.. అని ప్రశ్నించారు. పొతిరెడ్డిపాడుకు పొక్క పెట్టుకుని ఏపీకి నీళ్లు తరలించుకు పోయినప్పుడు మీరు మాట్లాడారా అని ప్రశ్నించారు. అసహనంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమౌతుందా అని కేటీఆర్ నుంచి ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ వాదంతో మీకు ఓటు వేస్తే రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని మండి పడ్డారు.

భీమవరం బుల్లోడు ఎవరో వీడియోలు బయటకు వస్తున్నాయో చెప్పాలన్నారు. మా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలుగు రాష్ట్ర సమితి.. నేను భీమవరంలో పోటీ చేస్తానని గతంలో నువ్వు మాట్లాడలేదా అని ప్రశ్నించారు. మీరు తిట్లు ఆపకపోతే మా వైపు నుంచి కూడా రియాక్షన్ చూడాల్సి వస్తుందని మాటకు మాట జవాబు ఇస్తాం అని సవాల్ చేశారు. కేటీఆర్ , కేసీఆర్ ఇద్దరూ భాష మార్చుకోవాలని సూచించారు.

Next Story