- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భాస్కర్ అవార్డు ఇచ్చుకున్నట్లే ఉంది మీ వ్యవహారం.. హరీశ్‌రావుకు ప్రభుత్వ విప్ కౌంటర్
హరీష్ రావు.. బూతుపిత ఎవరో.. జాతిపిత ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసు.. అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హరీష్ రావు.. బూతుపిత ఎవరో.. జాతిపిత ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసు.. అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన గురువారం మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని, ఆ తర్వాత అధికార అహంకారంతో కేసీఆర్ మాట్లాడిన భాష బయటకు తీయమంటావా..? అని ప్రశ్నించారు. నీ మామకు జాతిపిత అని మీకు మీరు బిరుదు ప్రధానం చేస్తే తెలంగాణ ప్రజలు కూడా చప్పట్లు కొట్టాలా..? అని నిలదీశారు. అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మనందం భాస్కర్ అవార్డు ఇచ్చుకున్నట్లే ఉంది మీ వ్యవహారం.. అంటూ సెటైర్లు వేశారు. హరీష్ రావు.. ఎక్కువ నోరు పారేసుకోకు.. కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఉర్కుంటారని నువ్వు భావిస్తే అది నీ అజ్ఝానం అవుతుంది.. అని మండిపడ్డారు.
మీ బండరాన్ని మా ముఖ్యమంత్రి ఒక్కొక్కటి బయటపెడతున్నారని అన్నారు. మీ అవినీతి అక్రమాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచుతున్నారని చెప్పుకొచ్చారు. మీ జాతిపిత డ్రామాలను ఒక్క దెబ్బతో మా ముఖ్యమంత్రి పటాపంచలు చేశారన్నారు. మా సీఎం దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుందని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయన్న భయంతో కేటీఆర్, హరీశ్‌రావు తెగ చించుకుంటున్నారని మండిపడ్డారు. మామ మెప్పు కోసం హరీశ్‌రావు ముఖ్యమంత్రి పైన నోరు పారేసుకుంటున్నాడని మండిపడ్డారు.






