బనకచర్లపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న సర్కార్.. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్, ఉత్తమ్

by Muthe.Rajitha |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు(Godavari-Banakacherla Link Project)పై తెలంగాణ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేయనుంది.

బనకచర్లపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న సర్కార్.. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్, ఉత్తమ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు(Godavari-Banakacherla Link Project)పై తెలంగాణ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttham Kumar Reddy) రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌(CR Patil)తో సమావేశం తెలంగాణ అభ్యంతరాలను వ్యక్తం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు గోదావరి నది నుండి 200 టీఎంసీ అడుగుల నీటిని పోలవరం వద్ద నుండి రాయలసీమ ప్రాంతంలోని పెన్నా బేసిన్‌కు తరలించాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను ఉల్లంఘిస్తుందని, పోలవరం ప్రాజెక్టు యొక్క స్కోప్‌ను విస్తరించడం ద్వారా నీటిని దారి మళ్లిస్తోందని ఆరోపిస్తోంది. ప్రాజెక్టు యొక్క ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (PFR)ను తిరస్కరించమని, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను పక్కన పెట్టాలని, టెండర్ల ప్రక్రియను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిని రేవంత్, ఉత్తమ్ కోరనున్నారు. ఇప్పటికే జూన్ 3న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పాటిల్‌ను కలిసి తెలంగాణ ఆందోళనలను వివరించారు.

Next Story