పీఎం కుసుమ్​పై ప్రభుత్వం ముందుకు రావాలి : బుర్ర అశోక్ కుమార్ గౌడ్

by Muthe.Rajitha |

పీఎం కుసుమ్​స్కీమ్​పై ప్రభుత్వం సానుకూలంగా ముందుకు రావాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్ర అశోక్ కుమార్ గౌడ్ ఈ మేరకు ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశారు.

పీఎం కుసుమ్​పై ప్రభుత్వం ముందుకు రావాలి : బుర్ర అశోక్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పీఎం కుసుమ్​స్కీమ్​పై ప్రభుత్వం సానుకూలంగా ముందుకు రావాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్ర అశోక్ కుమార్ గౌడ్ ఈ మేరకు ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశారు. రైతులకు, విద్యుత్ సంస్థలకు, బ్యాంకులకు , సోలార్ వెండర్స్ కు ఇలా అందరికీ పీఎం కుసుమ్ ​స్కీమ్ ​బాగా ఉపయోగపడుతుందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సోలార్ మోడల్ విలేజెస్ స్కీమ్​అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ మధ్యకాలంలో టీజీ రెండ్​కో పిలిచిన టెండర్ లో పెట్టిన నిబంధనలు పెద్ద పెద్ద సోలార్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఏ సోలార్ వెండర్ కి (స్థానికులకు) కూడా ఎంఎస్​ఎంఈలకు , పీఎం సూర్య ఘర్ లో టెండర్ లలో పాల్గొనుటకు అవకాశం లేకుండా పోయిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల పల్లె ప్రాంతాలలో ఉన్న గృహ వినియోగదారులకు ఈ స్కమ్​మెయింటైన్ చేయాలంటే స్థానికముగా ఉండే చాలామంది సోలార్ వండర్స్ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని కోరారు. అప్పుడే ఈ స్కీమ్​ సవ్యంగా అమలు అవుతుందని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పథకం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం చేసుకుని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సాఫీగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీహరి బాబు, రాజేష్ పరకాల, బాబు నాయుడు , బాద్రి నారాయణ, జాన్ విలియం ఉన్నారు.

Next Story