- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గురుకులాల్లో విష జ్వరాలపై ప్రభుత్వం మొద్దు నిద్ర : హరీష్ రావు ఫైర్
రాష్ట్రంలోని అనేక గురుకులాల్లో విద్యార్థులు విష జ్వరాల బారిన పడటంపై బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని అనేక గురుకులాల్లో విద్యార్థులు విష జ్వరాల బారిన పడటంపై బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గురుకులాల్లో విష జ్వరాలు ప్రబలుతుంటే అడ్డుకునే ఆలోచన లేకుండా, జ్వరం వచ్చిన పిల్లలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న సోయి లేకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం చేస్తానంటూ స్పీచులు దంచే సీఎం రేవంత్ రెడ్డికి సంగారెడ్డి జిల్లా సింగూరు గురుకుల పాఠశాల విద్యార్థుల అవస్థలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సింగూరు గురుకుల పాఠశాలలో 40 మందికి పైగా విద్యార్థులు విష జ్వారాలతో ఇబ్బంది పడుతుంటే.. ఆసుపత్రికి తరలించి వైద్యం అందించకుండా ఎందుకు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
విద్యార్థులను గురుకులంలోనే ఉంచి అరకొర వైద్యం అందించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని అన్నారు. మీ నిర్లక్ష్యం వల్ల ఇతర విద్యార్థులకు విష జ్వరాలు సోకే పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే విద్యార్థులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో విష జ్వరాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేసారు.






