‘టీజీ’ ఒక ఎమోషన్.. పార్టీ పేరు కలుస్తదనే ‘టీఎస్’ పెట్టారు?

by Disha Web Desk 14 |
‘టీజీ’ ఒక ఎమోషన్.. పార్టీ పేరు కలుస్తదనే ‘టీఎస్’ పెట్టారు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం ‘టీఎస్’ (తెలంగాణ స్టేట్) అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో అందరూ తెలంగాణ అనే పదానికి ‘టీజీ’కి ప్రజలు తమ వాహనాల నెంబర్లు మార్చుకున్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాకు అధికారికంగా ‘టీఎస్’గా ఫిక్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు.

ఈ టీఎస్ పదంపై అప్పట్లో ప్రభుత్వానికి విమర్శలు ఎదురైనాయి. చాలా మంది కూడా టీజీ అనే పదానికే కనెక్ట్ అయ్యారు. కానీ ప్రభుత్వం టీఎస్ గా పెట్టడంతో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. తాజాగా టీఎస్ నుంచి టీజీగా మార్పులు చేసేందుకు ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఈ క్రమంలో సచివాలయంలో నేటి మంత్రివర్గ సమావేశంలో పేరు మార్పుపై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. దీంతో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.

‘టీజీ’ అనేది ఒక ఎమోషన్..

టీఎస్ నుంచి టీజీగా మార్చితే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీజీ అనేది ఒక ఉద్యమమని, టీజీ అనేది తెలంగాణ ప్రజలకు ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ పేరుతో కలుస్తుందని నాడు కేసీఆర్ తెలంగాణకు టీఎస్ అని పెట్టారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనిపై కొందరు టీ - అంటే తెలంగాణ జీ - అంటే గడ్డ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే పేరు మార్పు పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


Next Story

Most Viewed