Sunstroke: హీట్‌వేవ్‌పై సర్కార్ అలర్ట్.. వారికి ఎక్స్‌గ్రేషియా పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే?

by Ramesh N |
Sunstroke: హీట్‌వేవ్‌పై సర్కార్ అలర్ట్.. వారికి ఎక్స్‌గ్రేషియా పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో హీట్‌వేవ్‌పై సర్కార్ అలర్ట్ అయింది. రాష్ట్రంలో ఎండలు మండుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. హీట్‌వేవ్ సమస్యపై యాక్షన్ ప్లాన్ అమలు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు చేసింది. తీవ్రమైన ఎండలు, వడగాలులు, (sunstroke) వడదెబ్బ వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబాలకు ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి వీలుగా జీవో విడుదల చేసింది. వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే గతంలో రూ.50 వేలు చెల్లించేవారు.. ఆ ఎక్స్‌గ్రేషియాను రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు సర్కార్‌ (Government increases ex-gratia) పెంచింది. ఈ మేరకు మంగళవారం రెవెన్యూ(డిజాస్టర్ మెనేజ్‌మెంట్) డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story

Most Viewed