కమాండ్ కంట్రోల్ సేవలు ఆర్ అండ్ బీ శాఖ కి.. ప్రభుత్వం కీలక నిర్ణయం

by Ramesh Naini |

కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సేవల టెండర్ల నిర్వహణ బాధ్యత రోడ్లు, భవనాల శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కమాండ్ కంట్రోల్ సేవలు ఆర్ అండ్ బీ శాఖ కి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సేవల (ఎఫ్ఎంఎస్) టెండర్ల నిర్వహణ బాధ్యత రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అత్యాధునిక భవనం యొక్క సమగ్ర నిర్వహణ బాధ్యతను రాబోయే 3 ఏళ్ల కాలపరిమితికి గాను ఆర్ అండ్ బీ శాఖకు టెండర్ల నిర్వహణ కొరకు అప్పగించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భవన నిర్వహణను చేపట్టేందుకు వివిధ అనుభవజ్ఞులైన సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించారు.

ఎంపికైన సంస్థ టీజీఐసీసీసీ భవనం రోజువారీ నిర్వహణ, సాంకేతిక విభాగాల పర్యవేక్షణ, ఇతర ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సేవలను అందిస్తుంది. ఈ ఒప్పందం 3 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది. పారదర్శకతను పాటిస్తూ, అత్యుత్తమ సేవలను అందించే సామర్థ్యం గల సంస్థల నుంచి బిడ్లను ఆర్ అండ్ బీ శాఖ టెండర్లను ఆహ్వానించింది. పోలీసింగ్, విపత్తు నిర్వహణలో కీలక పాత్ర పోషించే కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు సజావుగా సాగాలంటే, వృత్తిపరమైన భవన నిర్వహణ ఎంతో అవసరమని, అందుకే కీలకమైన ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీఐసీసీసీ డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story