- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వం కీలక నిర్ణయం.. మేడిపల్లిలో లైఫ్ సైన్సెస్ హబ్
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో లైఫ్ సైన్సెస్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్కడ రూ.24 కోట్లతో పనుల కోసం టెండర్లను ఆహ్వానించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో లైఫ్ సైన్సెస్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్కడ రూ.24 కోట్లతో పనుల కోసం టెండర్లను ఆహ్వానించింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ జిల్లాల్లో మౌలిక సదుపాయాల పనుల కోసం ఈ - ప్రొక్యూర్‌మెంట్ టెండర్ నోటీసులను విడుదల చేసింది. హెచ్‌జీపీసీ లేఅవుట్‌కు చేరువగా ఉండటానికి ప్రస్తుత గ్రామ బీటీ రోడ్లను వెడల్పు చేయడం, బలోపేతం చేయడం, ఎస్‌హెచ్ 19 వద్ద తక్కళ్లపల్లి గ్రామ బస్టాప్ నుంచి తక్కళ్లపల్లి విలేజ్ ద్వారా మేడిపల్లి గ్రామం వద్ద హెచ్‌జీపీసీ సరిహద్దు వరకు, మేడిపల్లి ఈసీవీ వద్ద ప్రతిపాదిత లైఫ్ సైన్సెస్ హబ్ అంతర్గత రహదారుల నిర్మాణానికి ఈ టెండర్లను ఆహ్వానించారు. టెండర్ కి సంబంధించి బిడ్ దాఖలు చివరి తేదీ వచ్చేనెల 4 వరకు ఇచ్చారు. అలాగే.. మిగిలిన టెండర్లకు సంబంధించిన వచ్చే నెల 12 వరకు అవకాశం కల్పించారు.
జీనోమ్ వ్యాలీకి ప్రత్యామ్నాయం
ఐటీకీ కేరాఫ్ అయిన జీనోమ్ వ్యాలీకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అడుగులు వస్తుంది. ముఖ్యంగా మేడిపల్లి పరిధిలో మరో జీనోమ్ వ్యాలీని సిద్ధం చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ జీనోమ్ వ్యాలీని గత ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం ఉన్నాయి. జీనోమ్ వ్యాలీ హైదరాబాదులో ఉన్న భారతీయ హై-టెక్నాలజీ వ్యాపార కేంద్రం. ఇక్కడికి సమీపంలో తుర్కపల్లి, శామీర్ పేట్, మేడ్చల్, ఉప్పల్, పటాన్‌చెరు, జీడిమెట్ల, గచ్చిబౌలి, కీసర ఉంది. జీనోమ్ వ్యాలీ బయోమెడికల్ పరిశోధన, శిక్షణ, తయారీ కోసం ఒక క్లస్టర్‌గా అభివృద్ధి చెందింది. అయితే.. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మేడిపల్లిలో లైఫ్ సైన్సెస్ హబ్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది.






