Dasara : అంగన్వాడీల చరిత్రలో ఇదే మొదటిసారి! ప్రభుత్వం కీలక నిర్ణయం

by Ramesh Naini |   (  Updated:2025-09-25 14:41:15  IST  )

అంగన్వాడిల సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) గుడ్‌న్యూస్ చెప్పింది.

Dasara : అంగన్వాడీల చరిత్రలో ఇదే మొదటిసారి! ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అంగన్వాడి సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణలోని అంగన్వాడీ (Anganwadi) కేంద్రాలకు ప్రభుత్వం (Dussehra holidays) దసరా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు రేపటి నుంచి ఎనిమిది రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల అక్టోబర్ 4 వరకు అంగన్వాడీలకు దసరా సెలవులు ప్రకటించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు దసరా సెలవులు మంజూరు చేయాలని అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethaka) ఆదేశాలిచ్చారు. టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడిల చరిత్రలో మొట్టమొదటిసారిగా అంగన్వాడీలకు దసరా సెలవులు ప్రకటించడమని సీతక్క వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే దసరా, బతుకమ్మ పండగలు జరుపుకునే విధంగా దసరా సెలవులు మంజూరు చేయాలని ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బి అన్నపూర్ణ, ఇతర ప్రతినిధులు మంత్రి సీతక్కను ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు 8 రోజుల పాటు అంగన్వాడీలకు సెలవులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమకు సెలవులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story