భద్రాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..ఇకపై ఆ కష్టాలకు చెక్

by Ajay Maddhiboyina |

భద్రాచలం వెళ్లే భక్తులకు ఆలయ ఈవో రమాదేవి గుడ్ న్యూస్ చెప్పారు. భక్తుల సౌకర్యార్థం దర్శనం, ప్రసాదం, అర్చన

భద్రాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..ఇకపై ఆ కష్టాలకు చెక్
X

దిశ, వెబ్ డెస్క్: భద్రాచలం వెళ్లే భక్తులకు ఆలయ ఈవో రమాదేవి గుడ్ న్యూస్ చెప్పారు. భక్తుల సౌకర్యార్థం దర్శనం, ప్రసాదం, అర్చన తదితర కార్యకలాపాలకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ప్రకటించారు. ఫెడరల్ బ్యాంక్ సౌజన్యంతో కియోస్క్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తద్వారావ వేగవంతంగా స్వామివారి సేవలను పొందవచ్చన్నారు. కియోస్క్ అచ్చం రైల్వే స్టేషన్‌లో ఉండే మిషిన్ మాదిరిగా ఉంటుంది. ఇందులో డెబిట్ కార్డులు లేదా యూపీఐ ద్వారా అవసరమైన సేవలకు సంబధించిన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. సాధారణంగా ఆలయాల్లో టికెట్ కౌంటర్ వద్ద సేవలకు సంబంధి టికెట్లు అందిస్తారు. కానీ ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చిన విధానం ద్వారా మరింత సులువుగా త్వరగా అవసరమైన టికెట్లు తీసుకోవచ్చు.

Next Story