Rythu Bharosa: రైతులకు తీపి కబురు.. అంతకన్న ముందే రైతు భరోసా: తుమ్మల

by Prasad Jukanti |   (  Updated:2025-06-03 08:07:58  IST  )

రైతుభరోసాపై తమ్మల కీలక ప్రకటన

Rythu Bharosa:  రైతులకు తీపి కబురు.. అంతకన్న ముందే  రైతు భరోసా: తుమ్మల
X

దిశ, ఖమ్మం బ్యూరో/ డైనమిక్ బ్యూరో/ఎర్రుపాలెం: భూ సమస్యల పరిష్కారానికి విప్లవాత్మకమైన, వినూత్నమైన చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని మంత్రి తుమ్మల అన్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా భూమి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అందుకే భూభారతి చట్టాన్ని ఈ ప్రభుత్వం తెచ్చిందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో అన్ని గ్రామాల్లో సమగ్ర సర్వేను ప్రభుత్వం చేపడుతుందని, ఇది పూర్తయితే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. సాధారణంగా భూముల జోలికి వెళ్లేందుకు పాలకులు భయపడతారని, కానీ సీఎం రేవంత్ మాత్రం ధైర్యంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. నాట్లు మొదలు కాక ముందే రైతుభరోసా నగదును రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నామని మంత్రి ప్రకటించారు. గత సంవత్సరం అన్ని కార్యక్రమాలు ఒకేసారి మొదలు పట్టడం ద్వారా రైతుభరోసా వెనకా ముందు అయిందని దీన్ని రైతులు అర్థం చేసుకున్నారని చెప్పారు.

Next Story