- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండగ వేళ మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా నాలుగు ఎకరాల భూమి
రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో తీపికబురు చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోన్న తరుణంలో సోలార్ విద్యుత్ (Solar Electricity) వైపు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. అన్ని జిల్లాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ‘ఇందిరా మహిళా శక్తి’ (Indira Mahila Shakthi) పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం నాలుగు ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అందుకు సంబంధించి జీవో కూడా జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో నివేదిక ఇవ్వాలని ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఒక్కో మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు రూ.3 కోట్లు అవసరం అవుతుండగా.. అందులో స్వయం సహాయక సంఘాలు 10 శాతం ఖర్చును భరించనుండగా.. 90 శాతం రుణం వివిధ బ్యాంకుల ద్వారా అందజేయనున్నారు. ప్రభుత్వ, దేవాదాయ, గిరిజన, నీటిపారుదల శాఖల ఆధీనంలోని భూములను ఈ ప్రాజెక్ట్ కోసం వినియోగించనున్నారు. సోలార్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఆయా సంస్థలకు విక్రయించి ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ కింద ఏడాదికి రూ.30 లక్షల ప్రాఫిట్ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.






