మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో మరో కొత్త పథకం!

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది.

మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో మరో కొత్త పథకం!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. మహిళా సంఘాల ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద విజయ డెయిరీ పార్లర్లను మహిళలకు కేటాయించేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా మండలానికి ఒకటి చొప్పున, మున్సిపాలిటీల్లో రెండు చొప్పున మహిళా సంఘాలకు విజయ డెయిరీ పార్లర్లు కేటాయించేలా అధికారులు ప్రణాళిక రచిస్తునట్టు సమాచారం. దీనిపై వారం పది రోజుల్లో విధివిధానాలను ఖరారు చేయనున్నారు. పార్లర్ కోసం మహిళా సంఘాలు పారిశ్రామికాభివృద్ధి సహకార సమాఖ్యకు రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, స్థలం ఏర్పాటు అనంతరం రూ.5,000 చెల్లిస్తే పార్లర్ మంజూరు చేస్తారు.

ఒక్కో పార్లర్ ఏర్పాటుకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుండగా, దీనికోసం ప్రభుత్వం లోన్లను అందించనుంది. అయితే ఈ పార్లర్లలో విజయ డెయిరీ ఉత్పత్తులైన పాలు, పెరుగు, పన్నీర్, వాటర్ బాటిళ్లు మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. ఈ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు వంటి కార్యక్రమాల ద్వారా మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఈ డెయిరీ పార్లర్ల కేటాయింపుతో వారి జీవనోపాధి అవకాశాలను మరింత పెంచనుంది.

Next Story