TG: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం

by Prasad Jukanti |   (  Updated:2026-05-23 13:17:24  IST  )

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో గోదావరి పుష్కరాలకు రూ.1000 కోట్లు, కొత్త ఉద్యోగాలు, భూముల కేటాయింపులపై కీలక నిర్ణయం తీసుకుంది.

TG: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించిన నిర్ణయాలు తీసుకుంటోంది. జూనియర్ కళాశాల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలుకు కొద్దిసేపటి క్రితమే ఆమోదం తెలిపిన కేబినెట్.. మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని నూతన డిగ్రీ కళాశాలకు 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, ఆరు నాన్ టీచింగ్ పోస్టులు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 3 పోస్టులు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఫైర్ స్టేషన్‍కు 18 పోస్టుల మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

భూమి కేటాయింపు:

అస్సాం రైఫిల్స్, BSF, CISF గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెలిది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్‍లో 5 ఎకరాలు, గన్నేరువరం మండలంలో 5 ఎకరాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనులకు రూ.1000 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించి తొలి విడతగా రూ.300 కోట్లు మంజూరుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.

Next Story