- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి స్పెషల్.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్
by GSrikanth |
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంకాంత్రి పండుగ జనవరి రెండో వారంలో ఉన్నందున పలు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ఈ రైలు సర్వీసులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1 వరకు రాకపోకలు కొనసాగిస్తాయని పేర్కొన్నారు. తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి, హైదరాబాద్-నర్సాపూర్, తిరుపతి-సికింద్రాబాద్, కాకినాడటౌన్-లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కాచిగూడ- కాకినాడటౌన్, హైదరాబాద్-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story






