- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెల 15 నుంచి నూతన హెల్త్ కార్డులు
తెలంగాణలో జూలై 15 నుంచి కొత్త ఈహెచ్ఎస్ (EHS) హెల్త్ కార్డులు అమలు.. 943 ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు!

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కార్డులను ఈ నెల 15 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో శుక్రవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు డిసిషన్ తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే ఉద్యోగులకు హెల్త్ కార్డులను అధికారికంగా పంపిణీ చేయనున్నట్టు సమావేశంలో వెల్లడించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన, నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఈ హెల్త్ కార్డు విధానం ఉపయోగపడుతుందని సీఎస్ అభిప్రాయపడ్డారు. అమలుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
క్యూఆర్ కోడ్‌తో..
క్యూఆర్ కోడ్‌తో నూతన హెల్త్ కార్డులు మొబైల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అన్ని వివరాలతో ‘ఈహెచ్ సీటీ’ యాప్‌ను రూపొందించనున్నారు. చికిత్సలకు సీజీహెచ్ఎస్ రేట్లు వర్తింపజేయాలని నిర్ణయించారు. నాలుగు రోజుల్లో నూతన ఈ హెచ్ ఎస్ మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 943 హాస్పిటల్స్‌లో హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో 2,594 ప్రొసీజర్స్ కవర్ కానున్నాయి.
మార్గదర్శకాల కోసం మీటింగ్..
నూతన ‘ఈహెచ్ఎస్’ మార్గదర్శకాలపై చర్చించేందుకు ఈ నెల 13న ‘ఆరోగ్యశ్రీ’ సీఈఓ తో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఖర్చుతో అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఎండీ.ఎక్కా, ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, డీజీ శిఖా గోయల్, కార్యదర్శలు హనుమంత్ కొండిబా, పాపిరెడ్డి, వాణి పాల్గొన్నారు. టీఎన్‌జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, బి. శ్యామ్, దామోదర్ రెడ్డి (పీఆర్‌టీయూ), చావా రవి (యూటీఎఫ్), శ్రీనివాసరెడ్డి (సెక్రటేరియట్ అసోసియేషన్), వంగా రవీందర్ రెడ్డి (ట్రెసా), సదానంద గౌడ్ (ఎస్‌టీయూ), సైదులు (ఎస్‌టీఎఫ్), దాస్య నాయక్ (క్లాస్-4 ఉద్యోగుల సంఘం), పెన్షనర్ల సంఘం ప్రతినిధులు వెంకటరెడ్డి, కృష్ణమూర్తి, ఉమాదేవి తదితరులు హాజరయ్యారు.






