- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
తెలంగాణ(Telangana)లో రేషన్ కార్డుదారులకు(Ration Cardsholders) గుడ్ న్యూస్.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో రేషన్ కార్డుదారులకు(Ration Cardsholders) గుడ్ న్యూస్. వర్షాకాలం(Rainy Season)లో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చేయడానికి 3 నెలల రేషన్ సరుకులు ఒకేసారి ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రానున్న జూన్, జులై, ఆగస్ట్ నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను అందించనున్నారు. వచ్చే వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదలు, రోడ్లు కొట్టుకోపోవడం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో ఒకేసారి పంపిణీ చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 89.96 లక్షల రేషన్ కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా, జనవరి 26 నుండి 10 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో లబ్ధిదారుల సంఖ్య 3.11 కోట్లకు పెరిగింది. ఈ కార్డుదారులకు 33 జిల్లాల్లో 365 రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ రేట్లలో సరుకులు అందించేందుకు రాష్ట్ర పౌర సరఫరా శాఖ సుమారు 22-24 లక్షల టన్నుల బియ్యం అవసరమని అంచనా వేసింది. అందుకు అనుగుణంగా 24 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి, మిల్లింగ్ ద్వారా 15-16 లక్షల టన్నుల బియ్యం సిద్ధం చేసింది.
జిల్లా స్థాయిలో స్టాక్ పాయింట్లలో నిల్వలు, రవాణా సౌకర్యాలు, ఆధార్ లింకింగ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయడం, నకిలీ కార్డులను రద్దు చేయడానికి స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టడం వంటి చర్యలతో పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు దాటని కుటుంబాలు, హైదరాబాద్‌కు వలస వచ్చిన కుటుంబాలు రేషన్ కార్డు కోసం అర్హులుగా ఉండగా, లబ్ధిదారులు తమ కార్డు స్టేటస్‌ను https://epds.telangana.gov.in/FoodSecurityAct/ లేదా MeeSeva పోర్టల్ ద్వారా తనిఖీ చేయవచ్చని పేర్కొంది. కొత్త కార్డుల కోసం ఆన్‌లైన్‌లో లేదా MeeSeva సెంటర్లలో ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.






