Big Good News: నేడు ఇందిరమ్మ ఇళ్లకు సీఎం శంకుస్థాపన

by Yella Dhawani Reddy |

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై (Indiramma Houses Scheme) రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

Big Good News: నేడు ఇందిరమ్మ ఇళ్లకు సీఎం శంకుస్థాపన
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై (Indiramma Houses Scheme) రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మొదటి విడత కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని శుక్రవారం (ఫిబ్రవరి 21) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై కాంగ్రెస్ ప్రభుత్వం వడపోతల ద్వారా అర్హులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నారాయణపేట మండలం అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా సీఎం స్వయంగా ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోస్తారు. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ లేని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక ఇల్లు లేని కుటుంబాల అందరికీ ఇళ్లు మంజూరు చేయాలనే ప్రభుత్వం సంకల్పంలో భాగంగా లబ్దిదారులు సొంతంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం ఇచ్చారు. ఈ పథంకలో భాగంగా మొతం ఇళ్లు నిర్మాణం పూర్తి అయ్యే వరకు రూ.5లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. మొదట ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్‌మెంట్ నిర్మించగానే రూ.లక్ష లబ్దిదారుని ఖాతాకి జమచేస్తారు. ఆ తర్వాత కిటికీలు, తలుపులు, గోడలూ నిర్మించకా.. అధికారులు పరిశీలించి లబ్దిదారుడి అకౌంట్‌కు రూ.1.25 లక్షలు జమచేస్తారు. అనంతరం స్లాబ్ పూర్తి అయ్యాక రూ.1.75 లక్షలు లబ్ధిదారుడి ఖాతాలోకి జమచేస్తారు. తర్వాత చివరిగా రూ.లక్ష అందజేస్తారు.

Next Story