- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OG Movie: పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్
పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం పడే అవకాశముందని పేర్కొంది. అయితే.. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా(OG Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. భారీ వర్షం ఉంటే.. ఈవెంట్‌ను శిల్పకళా వేదికకు తరలించాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే.. నగరంలో వర్షం పడే అవకాశం లేదని వాతావరణ కేంద్రం పేర్కొనడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు ఈ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవెంట్ సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కానున్నప్పటికీ, సందడి పూర్తి స్థాయిలో ఆరు గంటల తర్వాత మొదలయ్యే అవకాశాలున్నాయి.






