ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. పెండింగ్ బిల్లులకు రూ.713 కోట్లు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-31 09:57:02  IST  )

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో తెలంగాణ సర్కార్ (Telangana Government) ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది.

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. పెండింగ్ బిల్లులకు రూ.713 కోట్లు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో తెలంగాణ సర్కార్ (Telangana Government) ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మేరకు పెండింగ్ బిల్లులకు మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది. గ్రాట్యుటీ, జీపీఎఫ్ (GPF), సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌తో పాటు వివిధ బకాయిల చెల్లింపుకు సుమారు రూ.713 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా రూ.700 కోట్లకు పైగా నిధులను దశలవారీగా విడుదల చేస్తోంది. అక్టోబర్ నెలలో రూ.712 కోట్లు, నవంబర్ నెలలో రూ.707.30 కోట్లు విడుదల అనంతరం ప్రస్తుతం రూ.713 కోట్ల నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ నిధులతో రిటైర్డ్, సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ, జీపీఎఫ్ సెటిల్‌మెంట్లు, సరెండర్ లీవ్ బెనిఫిట్లు, అడ్వాన్స్ బిల్లులు, వైద్య రీయింబర్స్‌మెంట్ వంటి బకాయిలు క్లియర్ కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఈ నిధులను విడుదల చేశారు.

Next Story