పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధనలో మార్పు

by Disha Web Desk 13 |
పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధనలో మార్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త చెప్పింది. కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిషం నిబంధనను ఈసారి తొలగించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఎగ్జామ్ ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు పరీక్షా రాసేందుకు అనుమతి ఇచ్చేలా గ్రేస్ టైమ్ ను పొడిగించుతూ ఎస్సెస్సీ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఇంటర్ వార్షిక పరీక్షల్లోనూ నిమిషం నిబంధనను అధికారులు సడలించి ఐదు నిమిషాల వరకు గ్రేస్ టైమ్ ను పెంచారు. నిమిషం నిబంధన కారణంగా అనేక మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోవడంతో పాటు ఈ నిబంధన కారణంగా విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యల వైపు ఆలోచన చేస్తున్నారనే వాదనతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

టెన్త్ ఎగ్జామ్ కు ఏర్పాట్లు పూర్తి:

కాగా తెలంగాణలో మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే హాల్ టికెట్లను వవెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ సారి. పరీక్షలకు దాదాపు 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed