జోగులాంబ అమ్మవారికి బంగారు మకరతోరణం

by Elthuri vijay kumar |

ఐదో శక్తిపీఠం అలంపూర్ పుణ్యక్షేత్రంలో దసరా శరన్నవరాత్రులు సందర్భంగా జోగులాంబ అమ్మవారికి రూ.55 లక్షల విలువగల బంగారు మకరతోరణం.. పీఠం తొడుగును అందజేశారు.

జోగులాంబ అమ్మవారికి బంగారు మకరతోరణం
X

జోగులాంబ అమ్మవారికి బంగారు మకరతోరణం

బహూకరించిన తీగల క్రాంతిరెడ్డి- లక్ష్మీ స్రవంతి దంపతులు

విలువ రూ.55 లక్షలు ఉంటుదని అంచనా..

దిశ, అలంపూర్/ అలంపూర్ టౌన్: ఐదో శక్తిపీఠం అలంపూర్ పుణ్యక్షేత్రంలో దసరా శరన్నవరాత్రులు సందర్భంగా జోగులాంబ అమ్మవారికి రూ.55 లక్షల విలువగల బంగారు మకరతోరణం.. పీఠం తొడుగును అందజేశారు. బుధవారం హైదరాబాద్ పట్టణానికి చెందిన తీగల క్రాంతి రెడ్డి- లక్ష్మీ స్రవంతి దంపతులు జోగులాంబ అమ్మవారికి బంగారు పూతతో కూడిన ఈ మకరతోరణం, పీఠానికి తొడుగును బహూకరించారు. వీటి విలువ సుమారు రూ. 55 లక్షలు ఉంటుందని వారు తెలిపినట్లు అలయ ఈవో దీప్తి తెలిపారు. దంపతులను ప్రత్యేకంగా ఆహ్వానించి జోగులాంబ అమ్మవారికి పూజలను చేయించి సత్కరించారు. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కును చెల్లించుకోవడం పూర్వజన్మ సుకృతం అయిందని దంపతులు తెలిపారు.

Next Story