దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో గోల్డ్ ATM

by Disha Web Desk 2 |
దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో గోల్డ్ ATM
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏటీఎంకు వెళ్తే నగదు విత్ డ్రా చేసుకోవడం మనకు తెలిసిన విషయమే. కానీ దేశంలో తొలిసారి గోల్డ్ కాయిన్స్ విత్ డ్రా చేసుకునే ఏటీఎం హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. ఏటీఎం కార్డు ద్వారా డబ్బులకు బదులుగా బంగారాన్ని అంందిచే ఏటీఎం మెషీన్‌ను బేగంపేటలో గోల్డ్ సిక్కా అనే సంస్థ ప్రారంభించింది. ఈ ఏటీఎంను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోల్డ్ సిక్కా సంస్థ సీఈఓ సయ్యద్ తరుజ్ మాట్లాడుతూ.. ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా 99.99శాతం నాణ్యత కలిగిన 0.5, 1,2,5,10,20,50,100 గ్రాముల బంగారు నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పారు. ఇందుకో కోసం డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు తాము జారీ చేసే ప్రీపెయిడ్ కార్డులనూ ఉపయోగించవచ్చని భారత్ లో గోల్డ్ మార్కెట్ వేళలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 9:50 నుంచి రాత్రి 11:30 ఈ ఏటీఎం ద్వారా గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న ఈ గోల్డ్ ఏటీఎం త్వరలో ఎయిర్ పోర్ట్, ఓల్డ్ సిటీలో మరో మూడు, అబిడ్స్, సికింద్రాబాద్ తో పాటు వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్ లలో కూడా ప్రారంభించనున్నామని రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 3 వేల గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించే ప్రణాళికతో ఉన్నామని సంస్థ నిర్వహాకులు తెలిపారు.

Next Story