- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
20 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వండి.. అధికారులకు సీఎం ఆదేశం
2027 గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఘాట్ల అభివృద్ధి, బాసర మాస్టర్ ప్లాన్‍పై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలు, ఘాట్ల అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు. 2027 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా పుష్కర ప్రణాళికలపై సీఎంకు అధికారులు వివరించారు. టెక్నికల్ ఇంజినీర్ల కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో కమిటీ పర్యటించి 15-20 రోజుల్లో నివేదిక సమర్పించాలని, పూర్తి నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి పంపించాలన్నారు.
బాసర మాస్టర్ ప్లాన్‍పై కీలక సూచనలు:
సబ్ కమిటీ ఆమోదం తర్వాత కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. ప్రజాభవన్‍లో వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో ఘాట్ల విస్తరణపై దృష్టి సారించాలన్నారు. ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో ఘాట్ల విస్తరణ, రోడ్లు, కనెక్టివిటీ సమస్యలు లేకుండా చర్యలకు సీఎం సూచనలు చేశారు. బాసర ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై సీఎ సమీక్షించారు. ఆలయ విస్తరణపై అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు.






