- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోలాహలంగా జిహెచ్ఎంసి మైదానాలు ..!
క్రీడాకారులతో ,జిహెచ్ఎంసి మైదానంలో కోలాహలంగా మారాయి..సమ్మర్ అంటేనే పిల్లలకు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ప్రత్యేక సమయం అని చెప్పవచ్చు.

దిశ, ఖైరతాబాద్ : క్రీడాకారులతో ,జిహెచ్ఎంసి మైదానంలో కోలాహలంగా మారాయి..సమ్మర్ అంటేనే పిల్లలకు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ప్రత్యేక సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి వాటి పట్ల ప్రజలు ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. అందుకే గత కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీ ప్రత్యేక సమ్మర్ క్యాంప్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది కూడా 6 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు , మానసిక ఒత్తిడిని తగ్గించేలా గత నెల ఏప్రిల్ 27 నుంచి మే 31వరకు 37 రోజుల పాటు ప్రత్యేక సమ్మర్ క్యాంపులు ప్రారంభించారు..ఎంపిక చేసిన కొన్ని ప్రత్యేక క్రీడ ప్రాంగణాల్లో క్రీడలు నిర్వహిస్తూ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. క్రీడలు ఉదయం 4గంటల నుండి 8 గంటల వరకు మళ్ళీ ఉదయం 9గంటల నుండి 11గంటల వరకు శిక్షణ కొనసాగుతున్నాయి..సమ్మర్ కోచింగ్ క్యాంప్ కోసం 10 నుంచి 100 రూపాయల దాకా రుసుములు వసూలు చేస్తారు.
ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించాల్సి ఉంటుంది…షటిల్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్ బాల్, కరాటే, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, యోగా, క్యారమ్, చెస్, స్విమ్మింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా వేసవి కాలంలో నిర్వహించే సమ్మర్ క్యాంప్స్ వల్ల పిల్లల క్రీడల పట్ల ఆసక్తి పెరగటమే కాకుండా శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పిల్లలు ఇలా సమ్మర్లో క్యాంప్లో చేరితే ఉత్సాహంగా కొత్తగా ఏమైనా నేర్చుకుంటారని, దీని వల్ల వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు.. ఈ శిబిరాల్లో పాల్గొన్న పిల్లలు రాష్ట్ర స్థాయి , జాతీయ స్థాయి క్రీడాకారులుగా కూడా ఎదిగారు అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పిల్లలకు ఇష్టమైన అంశాల్లో శిక్షణ కొరకు పంపిస్తున్నారు…
జిహెచ్ఎంసి స్పోర్ట్స్ విభాగం అడిషనల్ డైరెక్టర్ రహీనా బేగం :
ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లల్ని చదువుతోపాటు క్రీడా రంగాల్లో ప్రోత్సహించాలి అని జిహెచ్ఎంసి స్పోర్ట్స్ విభాగం అడిషనల్ డైరెక్టర్ రహీనా బేగం అన్నారు..ఎంపిక చేసుకున్న క్రీడను బట్టి రుసుములు 10 నుండి 100 రూపాయల వరకు ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ sports.ghmc.gov.in చెల్లించి శిక్షణ పొందవచ్చు అని తెలిపారు. సనత్ నగర్ గ్రౌండ్ లో శిక్షణ పొందినవారిలో ఒకరు అండర్19 టీం ఇండియన్ జట్టుకు అడగా , ఐపీఎల్ లో ఇద్దరు మహిళలు ఆడారు.. 10 మందికి పైగా రాష్ట్రస్థాయిలో ఆడారు.. పిల్లల క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేవిధంగా శిక్షణతోపాటు , ప్రత్యేక మ్యాప్ పెయింటింగ్ కూడా ఇస్తున్నట్లు సనత్ నగర్ క్రికెట్ హెడ్ కోచ్ రాజ్ కిరణ్ తెలిపారు..






