- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రిప్టో కరెన్సీ పేరుతో ఘరానా మోసం.. విదేశాలకు పారిపోతున్న వ్యక్తి అరెస్ట్
క్రిప్టో కరెన్సీ (Crypto Currency) పేరుతో ప్రజలకు కుచ్చుటోపి పెట్టిన ఘరానా మోసగాడిని (fraudster) పోలీసులు అరెస్ట్ (arrested) చేశారు.

దిశ, వెబ్ డెస్క్: క్రిప్టో కరెన్సీ (Crypto Currency) పేరుతో ప్రజలకు కుచ్చుటోపి పెట్టిన ఘరానా మోసగాడిని (fraudster) పోలీసులు అరెస్ట్ (arrested) చేశారు. గ్రామాల్లో ఉండే అమాయక ప్రజలకు అధిక లాభాలు ఆశచూపి మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కవ అయిపోయాయి. డబ్బుకు ఆశపడి చదువుకున్న వారు కూడా వీరి వలలో పడుతున్నారు. ఫేక్ యాప్ లలో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఇలాంటి ఘటనే ఉత్తర తెలంగాణ (northern Telangana)లోని జిల్లాల్లో(Districts) జరిగింది. ఉమ్మడి కరీంనగర్ (karimnagar), మెదక్ (Medak), వరంగల్ (Warangal) జిల్లాల్లో క్రిప్టో కరెన్సీ పేరుతో రమేశ్ గౌడ్ అనే వ్యక్తి దందా నిర్వహించేవాడు.
జీడీఆర్ (GDR) పేరిట నకిలీ వెబ్ సైట్ (Fake Website) రూపొందించి, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు (Higher Profits) పొందవచ్చని అమాయకులకు ఎర వేశాడు. వాట్సప్ గ్రూప్ (Whats App Groups) లు క్రియేట్ చేసి సింగపూర్ (Singapoor), గోవా (Goa), దుబాయ్ (Dubai) కు విహార యాత్రలు ()Tours పంపిస్తామని చెప్పి, ప్రచారం చేశారు. దీంతో అధిక లాభాలకు ఆశపడి, రమేశ్ ను నమ్మి ప్రజలు పెద్ద ఎత్తున డబ్బును పెట్టుబడి (Investements)గా పెట్టారు. భారీగా డబ్బు జమ అయ్యాక మోసగాని అసలు రూపం బయటపడింది. దాదాపు రూ.100 కోట్లు తీసుకొని విదేశాలను పయనమయ్యాడు. నష్టపోయామని తెలుసుకున్న బాధితులు డీజీపీ ఆఫీస్ ను ఆశ్రయించారు. క్రిప్టో కరెన్సీ పేరుతో మోసపోయామని ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కోట్లు దండుకొని విదేశాలకు పారిపోతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.






