‘గంజా’ మిల్క్ షేక్.. రూట్ మార్చిన సప్లయర్స్

by Disha Web Desk 4 |
‘గంజా’ మిల్క్ షేక్.. రూట్ మార్చిన సప్లయర్స్
X

దిశ, క్రైమ్ బ్యూరో: యువతను మత్తు ఊబిలోకి దింపేందుకు గంజాయి స్మగ్లర్లు కన్నింగ్ ఐడియాలతో స్కెచ్‌లు వేస్తూ జోరుగా దందా చేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గంజాయి ముడిసరుకును పౌడర్‌లోకి మార్చి రోజుకో కొత్త రకంగా సప్లయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్వీట్స్, చాక్లెట్స్, హష్ అయిల్‌గా సరఫరా చేసిన కోల్‌కత్తా గంజాయి స్మగ్లర్లు తాజాగా గంజాయి మిల్క్‌షేక్స్‌ను తయారు చేస్తున్నారు. గంజా పౌడర్‌ను పాలు, హార్లిక్స్, బూస్టులో కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదంటూ సలహాలిస్తూ యువతను మత్తుకు బానిస చేస్తు్న్నారు. రెండు రోజుల క్రితం సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు జగద్గిరిగుట్ట ప్రాంతంలో జయశ్రీ కిరాణా దుకాణం నిర్వహిస్తున్న మనోజ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ మిల్క్‌షేక్ రహస్యం బయటపడింది.

కేజీ పౌడర్ రూ.2,500

హైదరాబాద్ సిటీనే టార్గెట్ చేస్తూ స్మగ్లర్లు గంజాయిని పౌడర్‌గా తీసుకొచ్చి చాక్లెట్లుగా, సిగరెట్ ఖాళీ చేసి అందులో నింపి సరఫరా చేస్తున్నారు. ఈ పౌడర్‌ను కేజీకి రూ.2,500కు, పౌడర్‌తో చేసిన చాక్లెట్‌ను ఒకటి రూ.40కి విక్రయిస్తున్నారు. మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులో ఉండొచ్చని యువతను ఆకర్షిస్తున్నారు. ఈ దందా అణచివేతకు నిరంతరం సమాచారం సేకరిస్తూ అడ్డాలను గుర్తించి నిందితులను అరెస్టు చేస్తున్నట్టు పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.


Next Story

Most Viewed