బుధుడి కటాక్షంతో ధనవంతులు కాబోతున్న రాశులు ఇవే.. మీ రాశి ఉందా?

by Disha Web Desk 10 |
బుధుడి కటాక్షంతో ధనవంతులు కాబోతున్న రాశులు ఇవే.. మీ రాశి ఉందా?
X

దిశ, ఫీచర్స్: ఖగోళ శాస్త్రంలో గ్రహాలకు ఎంత ప్రాముఖ్యత మనకీ తెలిసిందే. అలాగే జ్యోతిష్యంలో కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలు ఉండేవి, ప్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించడంతో ఇప్పుడు అష్టగ్రహాలు మాత్రమే మిగిలాయి. మెర్క్యురీ, సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం. ఇతనే గ్రహాలకు యువరాజు. బుధగ్రహ సంచారంలో ఏ చిన్న మార్పు వచ్చినా అది ఎవరి జీవితంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. మే 10న బుధుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ కారణంగా, రెండు రాశుల వారు లాభపడనున్నారు.

కర్కాటక రాశి

బుధ సంచారము కర్కాటకరాశి వారికి అనుకూల ఫలితాలనిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ కెరీర్‌లో పురోగతి ఉంటుంది. వ్యాపారులు, పెద్ద వ్యాపారాలను డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది. వారు గతంలో ఎన్నడూ చూడని ప్రయోజనాలను చూస్తారు. పేదరికం తొలగిపోయి మంచి ఆర్థిక స్థితిలు కనపడుతుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి బుధ సంచారము ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సంపద గణనీయంగా పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మీ కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. ప్రేమికుల మధ్య గొడవలు ముగిసి కలుస్తాయి. భార్యభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. మీ కెరీర్ గురించి శుభవార్తలు వినే అవకాశం ఉంది.

Next Story