- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయ్ గ్యాంగ్ vs ఎస్‌ఓటీ పోలీస్.. తూటాల సౌండ్‌తో దద్దరిల్లిన ఏరియా
ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఓ గ్యాంగ్‌ను సినిమా స్టైల్లో వెంబడించి పట్టుకున్నారు ఎస్‌వోటీ పోలీసులు.

దిశ, శంషాబాద్: ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఓ గ్యాంగ్‌ను సినిమా స్టైల్లో వెంబడించి పట్టుకున్నారు ఎస్‌వోటీ పోలీసులు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగానే పోలీసులని గన్‌తో బెదిరించడమే కాకుండా గాల్లోకి కాల్పులు జరిపి పారిపోవడానికి గంజాయి గ్యాంగ్ ట్రై చేసింది. కానీ వాళ్ల బెదిరింపులకు భయపడకుండా తూటాలకు దడవకుండా వెంటాడి వేటాడిన పోలీసులు మొత్తం గ్యాంగ్‌ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో మంగళవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్‌లో రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు మాటు వేశారు. ఈ క్రమంలోనే గంజాయి తరలిస్తున్న రెండు కార్లను అడ్డగించారు. అయితే గంజాయి గ్యాంగ్ కారు దిగి గన్‌తో బెదిరించి గాల్లో కాల్పులు జరిపి పరారయ్యే ప్రయత్నం చేస్తుండగా ఎస్వోటీ పోలీసులు వెంబడించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు ఉత్తరప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. అలాగే వారి వద్ద నుండి 240 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడమే కాకుండా నిందితులు ఉపయోగించిన రెండు కార్లను సీజ్ చేసినట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు.






