- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో దారుణం.. ఆటోలో తీసుకెళ్లి మహిళపై సామూహిక అత్యాచారం
తెలంగాణలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్(Nizamabad) జిల్లాలో మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారా(Gang rape)నికి పాల్పడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్(Nizamabad) జిల్లాలో మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారా(Gang rape)నికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల కేసులు, అత్యాచార ఘటనలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవల సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రెండు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనితల ఆదేశాలతో 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసినా ఘటనలు ఆగడం లేదు. అత్తాకోడళ్ల ఘటన మరువక ముందే నిజామాబాద్‌లో మరో మహిళలపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపుతోంది.






