Gang Rape: రాష్ట్రంలో మరో సంచలనం.. రాజ్యంగ నిర్మాత సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-12 07:43:45  IST  )

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు.

Gang Rape: రాష్ట్రంలో మరో సంచలనం.. రాజ్యంగ నిర్మాత సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. ముక్కుపచ్చలారని పసికందు నుంచి ముసలి వాళ్లను కూడా కామాంధుల వదలడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మతి స్థిమితం లేని ఓ మహిళపై దుండగులు గ్యాంగ్‌ రేప్‌ (Gang Rape)కు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా (Medak District)లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మసాయి‌పేట (Masaipet) మండల పరిధిలోని రామంతపూర్‌ (Ramanthapur)లో ఉన్న బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) విగ్రహం వెనుక వైపు గద్దెపై ఓ మతి స్థిమితం లేని మహిళపై దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు.

అయితే, తప్పిపోయిన గేదె కోసం అదే ప్రాంతంలో హంస దాబాకు చెందిన సీసీ టీవీ ఫుటేజ్ (CC TV Footage)ను పోలీసులు చెక్ చేస్తుండగా.. మతి స్థిమితం లేని మహిళపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. కాగా, మతి స్థిమితం లేని మహిళ తన వివరాలు చెప్పలేకపోవడంతో ఆమెను సమీపంలోని భరోసా సెంటర్‌కు పోలీసులు తరలించారు.

Next Story
null