14 రోజుల రిమాండ్: చంచల్‌గూడ జైలుకు గాదె ఇన్నయ్య

by Gantepaka Srikanth |

14 రోజుల రిమాండ్: చంచల్‌గూడ జైలుకు గాదె ఇన్నయ్య

14 రోజుల రిమాండ్: చంచల్‌గూడ జైలుకు గాదె ఇన్నయ్య
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party) సిద్ధాంతాలను ప్రచారం చేశారన్న ఆరోపణలతో సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య(Gade Innaiah)ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను నాంపల్లిలోని ఎన్‌ఐఏ(NIA) కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను నగరంలోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్‌ అంత్యక్రియలకు గాదె ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలతో గాదె ఇన్నయ్యను ఇవాళ ఉదయం అరెస్టు చేశారు. ఉపా (UAPA) చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు.

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత గాదె ఇన్నయ్య ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లారు. హిడ్మా తల్లిని కలిశారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమయంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అమిత్ షా తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చాలాసార్లు నోటీసులు పంపింది. తాజాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో అరెస్ట్ చేసింది.

Next Story