- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాల జగడానికి ఎండ్ కార్డు.. సంజయ్, జీవన్‌రెడ్డి వర్గాల మధ్య AICC సయోధ్య
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వర్గాల మధ్య తలెత్తిన విభేదాలను కాంగ్రెస్ అధిష్ఠానం పరిష్కరించింది. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో AICC కార్యదర్శి విశ్వనాథన్ సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఇరువురు నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో/జగిత్యాల ప్రతినిధి: జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నెలకొన్న ప్రతిష్టంభనకు కాంగ్రెస్ పెద్దలు తెరదించారు. గత కొంతకాలంగా ఉప్పు నిప్పుగా ఉండి పోటాపోటీ రాజకీయాలు చేసిన ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జీవన్‌రెడ్డి, సంజయ్‌లతో వేర్వేరుగా సమావేశమై చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరదించడంతోపాటు ఇరు వర్గాల మధ్య రాజీ కుదర్చడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తన వర్గం కౌన్సిలర్లతో వచ్చిన జీవన్‌రెడ్డి ఏఐసీసీ కార్యదర్శితో సుదీర్ఘంగా భేటీ అయి తన వాదనను వినిపించారు. తన వర్గం వారికి జరిగిన అన్యాయం. సంజయ్ తమ పట్ల వ్యవహరించిన తీరును వివరించినట్లుగా తెలిసింది. తనకు కేటాయించిన 16 బీఫారాల్లో 9 మందిని గెలిపించుకున్నానని, సంజయ్‌కి ఇచ్చిన 34 బీఫారాల్లో 14 మంది మాత్రమే గెలిచారని జీవన్‌రెడ్డి చెప్పారు. సంజయ్ టికెట్లు ఇవ్వని 9 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా గెలిచారని వారి దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలిసింది.
ఫోన్‌లో మాట్లాడిన మీనాక్షి నటరాజన్..
వాదనలు విన్న ఏఐసీసీ నేత, మంత్రి.. ఇరు వర్గాలు ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉందని చెప్పినట్లుగా తెలిసింది. సీనియర్ నేతగా పార్టీలో సమస్యలను చక్కదిద్దాల్సింది పోయి.. ఇలా రోడ్డున పడటం సరికాదని, ఇరు వర్గాలకు న్యాయం చేసే విధంగానే తాము వ్యవహరిస్తామని చెప్పినట్లుగా సమాచారం. మీనాక్షి నటరాజన్ కూడా ఫోనులో మాట్లాడటంతో మెత్తబడిన జీవన్‌రెడ్డి పార్టీలో మొదటి నుంచి ఉండి జెండా మోసిన వారికే చైర్మన్ పదవి, ఇరు వర్గాలకు చెరి సమానంగా చైర్మన్ పదవీ కాలాన్ని ఇవ్వాలని కోరినట్లుగా తెలిసింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినట్లుగా సమాచారం. అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌తో సవాంగ్, మంత్రి అడ్లూరి భేటీ కాగా ఆయన కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడంతో జగిత్యాల జగడానికి ఫుల్‌స్టాప్ పడింది.
పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. జీవన్‌రెడ్డి
పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉండి పార్టీ జెండా మోసిన వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని, పార్టీ ఆరంభం నుంచి ఉన్నవారికి న్యాయం చేయాలని కోరినట్లుగా చెప్పారు. తన వాదనను వినిపించానని, వారు ఓపికగా విన్నారని అన్నారు. తన ఆలోచనలు, నిర్ణయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరినట్టు వెల్లడించారు. పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ వశం..
జగిత్యాల మున్సిపల్ ఫలితాల్లో మొత్తం 50 వార్డులకు కాంగ్రెస్ 23, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు 15 మంది గెలిచారు. సంజయ్ తన వర్గానికి చెందిన 23మందితో, జీవన్‌రెడ్డి వర్గానికి చెందిన మరో 9 మంది తోడు కానుండటంతో చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది.






