ఫ్రీ జర్నీ ఎఫెక్ట్.. పురుషులకు స్పెషల్ బస్సు

by Disha Web Desk 13 |
ఫ్రీ జర్నీ ఎఫెక్ట్.. పురుషులకు స్పెషల్ బస్సు
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం మహాలక్ష్మి స్కీమ్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అనూహ్యంగా రద్దీ పెరగింది. ఆర్టీసీ బస్సులలో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో తమకు బస్సుల్లో కనీసం చోటు కూడా దక్కడం లేదంటూ పలువురు పురుషు ప్రయాణికులకు ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. ఈ క్రమంలో ఫ్రీ జర్నీకి సంబంధించిన జీవో 47 ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పురుషులకు ప్రత్యేక బస్సులు నడపాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ సిటీ రూట్ లో జెంట్స్ స్పెషల్ బస్సు దర్శనం ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఇబ్రహీంపట్నం-ఎల్ బీ నగర్ రూట్ లోని నడిచే 277 ఎల్ సిటీ ఆర్డినరీ బస్సు పురుషులకు స్పషల్ గా నడుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళా ప్రయాణికుల రద్దీ దృష్య్టా మిగతా రూట్లలోనూ పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని లేదంటే బస్సు సర్వీసులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.



Next Story

Most Viewed