- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ DNAలోనే మోసం ఉంది : ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరోసారి కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరోసారి కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ నిర్వహించిన బీసీ కులగణన తప్పుల తడకగా ఉందని విమర్శించారు. ముస్లింలు, బీసీలు, కలిపి 56 శాతం ఉండాలి.. కానీ రేవంత్ రెడ్డి 42 శాతమే ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేయవచ్చునని అన్నారు. కానీ కాంగ్రెస్ దానిని చేయదని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధం అయిందని, కాంగ్రెస్ DNAలోనే మోసం ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీపై ఒత్తిడి చేయకుండా.. పోరాటం చేసే మాపై విమర్శలు చేస్తే ఏంవస్తుందన్నారు.
ఆత్మగౌరవం ముఖ్యమని జైలు జీవితం నేర్పించిందని, జైల్లో స్వయంగా పేదల కష్టాలను చూశానని, బెయిల్ కోసం డబ్బులు లేక నెలల తరబడి జైల్లో మగ్గుతున్నవారిని చూశానన్నారు. జైలుకు వెళ్లే ముందే బీసీ ఇష్యూని తీసుకున్నానని, పూలే విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు కానీ టెక్నికల్ సమస్యల వల్ల విగ్రహ ఏర్పాటు ఆగిందన్నారు. బీఆర్‌ఎస్‌లో నేను లైఫ్ టైమ్ మెంబర్‌నని, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ఆందోళన చేశానని గుర్తు చేసారు. మా మధ్య అభిప్రాయబేధాలే తప్ప బేధాభిప్రాయాలు లేవన్నారు. లేఖ లీక్ చేసిందెవరో చెప్పాలన్నదే తన డిమాండ్ అని, వాళ్లను పట్టుకునేవరకు దూరంగా ఉండాలనుకున్నట్టు కవిత పేర్కొన్నారు.
తాను ఎవరికీ పోటీగా మీటింగ్ పెట్టలేదని, యాక్సిడెంటల్‌గా పార్టీ మీటింగ్ పెడితే పెట్టి ఉండొచ్చన్నారు. కేసీఆర్‌కు, పార్టీకి ఎప్పటికీ నష్టం చేయనని స్పష్టం చేశారు. తాను బీసీ రిజర్వేషన్లపై దీక్ష చేస్తే బండి సంజయ్‌కు వచ్చిన ఇబ్బందేంటి అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ మోసాన్ని ఎండగట్టేందుకే దీక్ష చేయాలనుకుంటున్నానని, కేంద్రంలో వస్తే 50 శాతం ఉన్న క్యాప్ ఎత్తివేస్తామని కాంగ్రెస్ చెబుతోందని అన్నారు.






