- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రీలాంచ్ స్కీమ్‌ల పేరుతో మోసం.. నగరంలో మరోసారి ఈడీ సోదాలు
హైదరాబాద్ (Hyderabad) నగర శివార్లలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కానుండటంతో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నగర శివార్లలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కానుండటంతో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహించారు. భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఏకకాలంలో పలుచోట్ల దాడులు కొనసాగుతున్నాయి.
కాగా, ప్రీలాంచ్ స్కీమ్ (Pre-Launch Scheme)ల పేరుతో కస్టమర్ల నుంచి భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సుమారు రూ.70 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఫ్లాట్లు, ప్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారని బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. తాజాగా ఆ కేసు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ విచారణలో భాగంగా ఇవాళ భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.






